![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-13లో.. మహా వాళ్లింట్లో చక్రి కారు తుడుస్తుంటాడు. అప్పుడే మహా వాళ్ళ అన్నయ్య వచ్చి.. యాదగిరిగుట్టకి వెళ్తున్నాం.. లోపల లగేజీ ఉంది తీసుకురమ్మని చెప్పగా అతను డిజప్పాయింట్ అవుతాడు. ఇక చక్రి లగేజీ తెస్తుంటే మహా వాళ్ళ నాన్న.. అతడిని ఆపి.. మా ఇంటికి డ్రైవర్ గా వస్తావా అని అడుగుతాడు. వస్తానని చక్రి చెప్తాడు.
మహా వాళ్ళ ఫ్యామిలీ అంతా కార్ లో వెళ్తుంటారు. దారిలో మహాకి ఇష్టమైన స్వీట్ కొనడానికి స్వీట్ షాప్ దగ్గర ఆపమంటాడు వాళ్ల నాన్న. నాకేం వద్దని మహా అంటుంది. అయినా వినకుండా వాళ్ళంతా కార్ దిగి వెళ్తారు. ఇక అదే సమయంలో చక్రి తనతో మాట్లాడతాడు. మీరేం టెన్షన్ పడకండి నేను పెళ్ళి జరగకుండా చూస్తానని మహాకి చక్రి నమ్మకంగా చెప్తాడు. నీకెందుకు.. మా నాన్నకి తెలిస్తే నిన్ను చంపేస్తాడని చక్రితో మహా అంటుంది. ఆ తర్వాత అందరు వెళ్తారు.
ఇక రాత్రి అందరు భోజనం చేస్తుంటారు. రేయ్ ఆది రిజిస్టర్ మ్యారేజ్ కి ఎవరెవరిని పిలుద్దామని మహా వాళ్ళ నాన్న అడుగుతాడు. తింటున్న మహా వెంటనే కోపంగా లేచి నిల్చుంటుంది. ఏమైందమ్మా కూర నచ్చలేదా అని మహా వాళ్ళ నాన్న అడుగగా.. కూర నచ్చకపోతే పచ్చడి వేసుకొని తినొచ్చు.. కానీ భర్తే నచ్చకపోతే జీవితాంతం భరించాల్సిందేగా అని మహా అంటుంది. నువ్వు అతడిని నెగెటివ్ గా చూడటం మానెయ్యాలి.. అతను బాగా చూసుకుంటాడని మహాని వాళ్ళ నాన్న కన్విన్స్ చేస్తాడు. దాంతో మహా కోపంగా వెళ్ళిపోతుంది.
మరోవైపు చక్రి బయట ఉంటాడు. వీళ్ళు అన్నం పెడతారా.. బయటకు వెళ్ళి తినేసి రావాలా అని చక్రి ఆకలితో అటు ఇటు తిరుగుతుంటాడు. ఇంతలో మహా బాధతో బయటకు వచ్చి కూర్చుంటుంది. ఇక తన దగ్గరకి చక్రి వచ్చి.. నేను బయటకి వెళ్ళి తిని రావాలా.. పెడతారా లేదా అని అడుగుతాడు. తినలేదా అని మహా అడుగుతుంది. లేదని చక్రి అనగానే మహా లోపలికి వెళ్లి అన్నం , చాపల పులుసు, చాపల ఫ్రై తీసుకొని వస్తుంది. ఇక అది తింటూ మహాకి సపోర్ట్ గా మాట్లాడతాడు. నీ రిజిస్టర్ మ్యారేజ్ అవ్వకుండా నేను చూసుకుంటా.. మీరు నా కోసం ఇంత చేశారు.. నేను ఇది చేయలేనా అంటూ మహాకి నమ్మకం కలిగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |